Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనకు తానే విడాకులు ఇవ్వనున్న యువతి! ఇక నా వల్ల కాదంటూ..!

Within 24 Hours Of Marriage To Herself Woman Considers Divorce
Advertisement
  • నెట్టింట యువతి ఉదంతం వైరల్
  • తనను తానే పెళ్లి చేసుకున్న యువతి
  • విడాకులకు సిద్ధమంటూ 24 గంటల్లోనే ప్రకటన
  • యువతిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
Advertisement
తనని తాను పెళ్లి చేసుకున్న ఓ యువతి 24 గంటలు కూడా గడవకమునుపే విడాకులు తీసుకుంటానంటూ ప్రకటించడం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లకు చిర్రెత్తేలా చేస్తోంది. సోఫీ మారీ అనే యువతి ఫిబ్రవరి 20న తన పెళ్లి విషయాన్ని తొలిసారిగా తన ఫాలోవర్లతో పంచుకుంది. తనని తానే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఘనంగా ప్రకటించింది. పెళ్లి దుస్తులతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అప్పట్లో ఆమెకు అనేక మంది మద్దతుగా నిలిచారు. ఎవరిని వారు గౌరవించుకోవాలన్న విషయాన్ని చాలా గొప్పగా చాటిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. 

ఈ ప్రకటన వెలువడిన 24 గంటలు కూడా గడవకమునుపే యువతి మరో సంచలన విషయం బయటపెట్టింది. తాను ఈ పెళ్లితో విసిగిపోయానని, ఇక తన వల్ల కాదంటూ వరుస కామెంట్లతో నెట్టింట ఊదరగొట్టింది. విడాకులకు సిద్ధమైపోయానంటూ చివరకు తేల్చి చెప్పింది. దీంతో.. నెటిజన్లలో కొందరు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసం వివాహ వ్యవస్థతో పరాచకాలు ఆడటం మానుకోవాలని హితవు పలికారు. మనుషుల మూర్ఖత్వానికి అంతే లేదంటూ మరికొందరు నిర్వేదం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
Trending

More Telugu News